కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్‌లో ఫ్రెషర్స్ కోసం భారీ వాక్ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ డ్రైవ్‌లో Process Executive (Non Voice) పోస్టులకు 200 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. ముఖ్యంగా 0 నుంచి 6 నెలల అనుభవం ఉన్న ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కామర్స్, సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో చదివిన వారు ప్రాధాన్యం పొందుతారు.
ఈ జాబ్‌లో భాగంగా డేటా ప్రాసెసింగ్, అనలిసిస్, ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, టెక్నాలజీపై అవగాహన అవసరం. ముఖ్యంగా Google Chrome, Docs వంటి టూల్స్‌పై పరిచయం ఉండాలి.
అలాగే AMCAT పరీక్షలో కనీసం 1100 స్కోర్ ఉండాలి. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ స్కిల్స్‌లో మంచి పట్టు ఉండాలి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా అవసరం.
ఈ ఉద్యోగానికి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ (నైట్ షిఫ్ట్స్ సహా)లో పని చేయాల్సి ఉంటుంది. 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్కు సిద్ధంగా ఉండాలి.
Check Here: https://tinyurl.com/4edvpsx5
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
