Advertisement

TG: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం రోజుకు కోటి మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత సదుపాయాన్ని చూసి ఓర్వలేక కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ ఎప్పుడైనా మహిళల సంక్షేమం గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు పెట్రోల్‌ బంకులు, సోలార్‌ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్నామని, గడచిన పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, తమ 1,000 రోజుల అభివృద్ధి, సంక్షేమ పాలనకు బేరీజు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు

Advertisement
Advertisement