Advertisement

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక, పిచ్చుకలంక: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని, వారిని కలిసే క్రమంలో ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తగినంత విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించినట్లు చంద్రబాబు వెల్లడించారు. పిచ్చుకలంక గ్రామంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులపై కూడా సీఎం స్పందించారు. పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.152 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా తీసుకువస్తామని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement