Advertisement

ఉద్రిక్తంగా సీజేపీ సంసద్ చలో మార్చ్

మన పత్రిక, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన సంసద్ చలో ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు పార్లమెంట్ వైపునకు దూసుకురావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడమే కాకుండా భాష్పవాయువును, రబ్బర్ బులెట్లను ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా దిల్లీ వ్యాప్తంగా మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ దింపుల్ యాదవ్‌ను, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. మరోవైపు, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంక్కా తమ డిమాండ్లతో కూడిన లేఖను జేపీ నడ్డాకు సమర్పించారు. నీట్ పేపర్ లీకేజీపై మంత్రిని తొలగించాలని, సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని వారు కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను నడ్డా కలిసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
Advertisement