Advertisement

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

మన పత్రిక: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న నిరసనల కారణంగా పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI Suryakant) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. భద్రతా కారణాల దృష్ట్యా జంతర్‌మంతర్ సహా సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని కీలక మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ గేట్లను అధికారులు మూసివేశారు. దీనివల్ల నిత్యం ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ అంశాన్ని ఒక న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. నిరసనల వల్ల మెట్రో స్టేషన్లు మూతపడటం, ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన విన్నవించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితిని తాము గమనిస్తున్నామని తెలిపారు. ప్రజల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడితే అవసరమైన పక్షంలో ఈ వ్యవహారంలో త్వరలోనే కోర్టు జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement