మన పత్రిక, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది. డిజీలాకర్ పోర్టల్‌లో మే 10న “ఫలితాలు త్వరలో” (Results Soon) అనే నోటీసు దర్శనమివ్వడంతో ఏ క్షణమైనా మార్కులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ట్రెండ్‌ను బట్టి మే 11 నుంచి 20వ తేదీ లోపు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ కోడ్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను నమోదు చేసి డిజీలాకర్, సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లలో తమ మార్కులను సులభంగా సరిచూసుకోవచ్చు.
మరోవైపు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం దిల్లీ ఎయిమ్స్ సైకియాట్రీ విభాగంతో కలిసి ‘ప్రాజెక్ట్ మేట్’ రెండో దశను సీబీఎస్‌ఈ అధికారికంగా ప్రారంభించింది. చైర్‌పర్సన్ రాహుల్ సింగ్ పర్యవేక్షణలో దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని 60కి పైగా పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ‘మేట్-5 సర్కిల్’ విధానం ద్వారా విద్యార్థులు ఒకరికొకరు తోడ్పడేలా చేయడంతో పాటు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- హాస్పిటల్ బెడ్‌పై వైఎస్ షర్మిల సర్జరీ జరిగినట్లు వెల్లడించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్
- తెలంగాణలో రెండవ త్రైమాసికంలో తగ్గిన ద్వేషపూరిత నేరాలు
- హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- కార్గిల్ విజయ్ దివస్ సందర్భంలో సైనికుల త్యాగాలను స్మరించుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- కాపు వర్గాలు మద్దతు ఇచ్చిన పార్టీకే అధికారం దక్కుతుంది: ఎమ్మెల్యే బొండా ఉమా
