Advertisement

శంషాబాద్‌లో క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, నిందితుడి అరెస్ట్

మన పత్రిక, శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జులై 20న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్‌ను డ్రైవర్ మార్గమధ్యంలో దారి మళ్లించాడు. అండర్‌ కన్స్ట్రక్షన్‌లో ఉన్న సాంక్టా మారియా స్కూల్ సమీపంలో వాహనాన్ని ఆపి, టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి తిరిగి వచ్చి వెనుక సీటులో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిద్ధాంతిలో నిందితుడు ఎర్రపోగు ప్రశాంత్ కుమార్(23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు తరలించింది.

Advertisement
Advertisement