BigBasket హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం భారీ వాక్ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 490 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అయితే B.Tech, MBA, PG ఫ్రెషర్స్‌కు అర్హత లేదు. ఫ్రెషర్స్‌తో పాటు BPO అనుభవం ఉన్నవారికి కూడా మంచి అవకాశం ఉంది.
ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో కాల్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు English, Hindi, Telugu (లేదా Marathi/Bengali) భాషలపై పట్టు ఉండాలి. టైపింగ్ స్పీడ్ కనీసం 20–25 WPM ఉండాలి. పని మొదటి 3 నెలలు అమీర్‌పేట్ ఆఫీస్‌లో (WFO) చేయాల్సి ఉంటుంది, తరువాత Work From Home అవకాశం ఉంటుంది (అవసరమైతే 2 నెలలకు 6 రోజులు ఆఫీస్‌కు రావాలి).
జీతం సంవత్సరానికి సుమారు ₹2 లక్షల నుంచి ₹2.5 లక్షల వరకు ఉంటుంది. షిఫ్ట్స్ రొటేషనల్‌గా (ఉదయం 6 నుంచి రాత్రి 11:45 మధ్య 9 గంటలు) ఉంటాయి. టీమ్ ప్లేయర్‌గా పని చేసే సామర్థ్యం, మంచి అటిట్యూడ్, కమిట్మెంట్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
