మన పత్రిక: దేశ ఇంధన భద్రత, రైతుల ఆదాయం మరియు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎథనాల్ పరిశ్రమలను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమలవుతున్న ప్రాంతాల వారీ ఎథనాల్ కేటాయింపు విధానాన్ని మార్చవద్దని, అలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
ఈ కొత్త దేశవ్యాప్త కేటాయింపు విధానం వల్ల స్థానిక రైతుల నుంచి పంటల కొనుగోలు తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త్రైమాసిక టెండర్లు విడుదల చేయకపోవడంతో కొత్త పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని, నెలకు రూ. 2 నుండి 3 కోట్ల వరకు వడ్డీ భారం పడుతోందని వివరించారు. ఈ క్రమంలో, మిగులు ఎథనాల్‌ను ఇతర పారిశ్రామిక రంగాలకు విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని మరియు పాత వాహనదారుల ఆందోళనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
