Advertisement

రాజమండ్రిలో గాల్లోకి లేచిన ఆటో

AP: రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైలు వంతెన ప్రారంభంలో ఓ ఆటో అనూహ్య రీతిలో గాల్లోకి లేచిన సంఘటన కలకలం రేపింది. అధిక బరువుతో చెక్కల లోడును తీసుకెళ్తున్న ఆటో, రోడ్డుపై ఉన్న మూడు స్పీడ్ బ్రేకర్లను దాటే క్రమంలో తీవ్రంగా అదుపుతప్పింది. వెనుక వైపు బరువు ఎక్కువగా ఉండటంతో వాహనం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు తక్షణమే స్పందించి, ఆటోలోని చెక్కలను బయటకు తీసి వాహనాన్ని సురక్షితంగా కిందకు దించారు.

కాగా, ఈ ప్రాంతంలో ఉన్న మూడు స్పీడ్ బ్రేకర్ల వల్ల నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యంగా ఉన్న ఈ స్పీడ్‌ బ్రేకర్లపై సంబంధిత పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement