అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (Andhra Pradesh) అభివృద్ధి, రాజధాని భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా కీలక అడుగులు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేస్తే, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు … Read more

బర్త్ డే పార్టీ విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్​డెస్క్, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy District) అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీకి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న విద్యార్థుల ప్రయాణం మృత్యుఒడిలో ముగిసింది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీబీఏ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మిర్జాగూడ గేట్ సమీపంలో అదుపుతప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. బర్త్ డే వేడుకల అనంతరం.. … Read more

TVK Chief Vijay CBI Inquiry: సీబీఐ నోటీసులు.. జనవరి 12న ఢిల్లీలో విచారణ

మన పత్రిక వెబ్​డెస్క్, చెన్నై: ప్రముఖ నటుడు, తవిక (TVK) అధినేత విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బిగ్ షాక్ ఇచ్చింది. గతేడాది కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది అభిమానులు మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం … Read more

అమెరికాలో హత్యకు గురైన నిఖితా మృతదేహం హైదరాబాద్ కు.. నిందితుడు అరెస్ట్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖితా గోదిశాల (27) మృతదేహం నేడు (జనవరి 8) నగరానికి చేరుకోనుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో విదేశాంగ శాఖ అన్ని అనుమతులు జారీ చేసిందని, బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. నిఖితా తన మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ చేతిలో న్యూ ఇయర్ ఈవ్ రోజున దారుణంగా హత్యకు గురైంది. … Read more

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు.. జనవరి 16న కీలక ఘట్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం … Read more

నేటి పంచాంగం (08-01-2026): రాహుకాలం, అమృత ఘడియలు, తిథి వివరాలు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: హైందవ సంప్రదాయంలో పంచాంగానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏ శుభకార్యం తలపెట్టాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, లేదా దైవారాధన కోసమైనా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలను (పంచాంగం) కచ్చితంగా పరిశీలిస్తుంటారు. కాలగమనంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల సంచారం ఆధారంగా మన దైనందిన జీవితంలో అనుకూల, ప్రతికూల సమయాలను పంచాంగం సూచిస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 08, 2026 గురువారం నాటి … Read more

Cognizant : కాగ్నిజెంట్ లో ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కి సదవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి

Cognizant Latest job update

ప్రముఖ IT సాఫ్ట్వేర్ కంపెనీ (Soft were) అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) ఫ్రెషర్స్ (Freshers) కి అదిరిపోయే జాబ్ Recruitments నోటిఫికేషన్ వచ్చేసింది. ఇండియాలో ఉన్న అన్ని IT లొకేషన్లలో ఈ జాబ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్స్ కి అర్హులు. ముఖ్యంగా 2024, 2025 లో డిగ్రీ పూర్తి చేసిన యువతీ … Read more

IT Accenture Jobs : యాక్సెంచర్ లో భారీగా ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కోసమే

Accenture job updates in hyderabad

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఆక్సెంచర్ (Accenture Recruitment) లో తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈకంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Associate Software Engineer @ PAN India) ఉద్యోగాలు విడుదల చేయగా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి BE, BTech, ME, MTech, MCA, MSc పూర్తి చేసిన యువత అర్హులు. అది కూడా 2025 లో పూర్తి చేసిన ఫ్రెషర్స్ కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే 2ఇయర్స్ … Read more

Sankranti: స్పెషల్ బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీల పెంపు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) షాక్ ఇచ్చింది. పండుగ రద్దీ కోసం ఏర్పాటు చేసిన 6,431 ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను సాధారణం కంటే 1.5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే కొనసాగుతాయి. మహిళలకు … Read more

అమరావతి రైతులకు శుభవార్త.. రూ.1.50 లక్షల రుణమాఫీ

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. తుళ్లూరు మండలం వడ్లమానులో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి … Read more