Biggboss 9 Telugu: 6 మంది వైల్డ్ కార్డ్

bigg boss 9 telugu wild card contestants

bigg boss 9 telugu wild card contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం రెండు షాకింగ్ ఎలిమినేషన్లు. ఫ్లోరా సైనీ, శ్రీజలను హౌస్ నుంచి షో నిర్వాహకులు ఎలిమినేట్ చేశారు. అయితే, వారి స్థానంలో కొత్త రోలర్ కోస్టర్ రాబోతోంది! నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (‘గోల్కొండ హైస్కూల్’ ఫేమ్), రమ్య మోక్ష (‘అలేఖ్య చిట్టీ పికిల్స్’), అయేషా (సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) – … Read more

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్

Out sourcing employees corporation Telangana

తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ( Out sourcing employees corporation Telangana ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ ఏజెన్సీల వల్ల ఉద్యోగులు వేతన దోపిడీకి గురవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి హక్కులు, వేతనాలు … Read more

TG: మెదక్ జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, కొట్టి చనిపోయిందనుకుని వెళ్లిపోయారు..!

TELANGANA: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొల్చారం మండలంలోని సంగాయిగూడ తండాకు చెందిన, అడ్డా కూలీగా పనిచేసే ఓ మహిళ అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల అంచనా ప్రకారం శుక్రవారం ఉదయం టిఫిన్‌తో మెదక్ అడ్డాకు వచ్చిన ఈ మహిళను పని ఇస్తామని చెప్పి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ … Read more

యూపీఐ ద్వారా స్కూల్‌ ఫీజు చెల్లింపు

దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, పాఠశాలల్లో ఫీజుల వసూలు ప్రక్రియను ఆధునికీకరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అడ్మిషన్లు, పరీక్షా ఫీజులు సహా స్కూళ్లకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలకు యూపీఐ (UPI), మొబైల్‌ పేమెంట్ల వంటి డిజిటల్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు తాజాగా లేఖలు రాసింది. ఈ ఆదేశాల పరిధిలోకి సీబీఎస్‌ఈ (CBSE), కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల వంటి ప్రముఖ … Read more

సీఈఆర్‌ఎస్‌ఏఐలో భారీ జీతంతో ఉద్యోగాలు

సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.Tech, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. ఇందులో మేనేజర్‌కు ₹40,000 నుంచి ₹1.40 లక్షల వరకు, అసిస్టెంట్ … Read more

యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 5 యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ ను సందర్శించవచ్చు.

నటి మంచు లక్ష్మికి జర్నలిస్ట్ మూర్తి క్షమాపణ

దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో జర్నలిస్ట్ వేదుల మూర్తి మంచు లక్ష్మి దుస్తులపై ప్రశ్న అడగడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంచు లక్ష్మీ ‘మా’ అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్‌లను ఆశ్రయించి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లక్ష్మితో ఇంటర్వ్యూలో తాను అడిగిన ప్రశ్నలు ఆమెకు బాధ కలిగించాయని తెలుసుకున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. “నేను అడిగిన ప్రశ్నలు మీరు బాధ … Read more

TG: ఏఐతో సీఎం చంద్రబాబు పేరుతో మోసం.. టీడీపీ నేతలకు టోకరా

Telangana: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫోన్ చేసినట్లుగా నమ్మించి గుర్తుతెలియని సైబర్ నేరగాడు తెలంగాణ టీడీపీ నాయకులను మోసగించాడు. సత్తుపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలకు AI సాయంతో వీడియో కాల్స్ చేసి, రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికాడు. అనంతరం, వారి నుంచి ఫోన్‌పే ద్వారా కొంత నగదును వసూలు చేశాడు. ఈ ఘటనలో మోసపోయిన నేతలను తెలంగాణ నుంచి … Read more

TG: బీసీ రిజర్వేషన్లపై 14న రాష్ట్ర బంద్: ఆర్.కృష్ణయ్య

Telangana: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 9 హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలపై, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం నాయకులు, ఎంపీ ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న అన్ని బీసీ సంఘాలతో కలిసి … Read more

Telangana: నేడే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి

Telangana: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది. యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు నేడే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించామని, ఆసక్తి గల ఉద్యోగులు, అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించాలన్నారు.