దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో జర్నలిస్ట్ వేదుల మూర్తి మంచు లక్ష్మి దుస్తులపై ప్రశ్న అడగడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంచు లక్ష్మీ ‘మా’ అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్లను ఆశ్రయించి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లక్ష్మితో ఇంటర్వ్యూలో తాను అడిగిన ప్రశ్నలు ఆమెకు బాధ కలిగించాయని తెలుసుకున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. “నేను అడిగిన ప్రశ్నలు మీరు బాధ పడ్డారని ఈమధ్య కాలంలోనే తెలిసింది. దానికి చింతిస్తున్నాను. ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ విషయంపై భేషరతుగా క్షమాపణ చెబుతున్నాను” అని మూర్తి అందులో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో తన వస్త్రధారణ గురించి జర్నలిస్ట్ అభ్యంతరకరమైన ప్రశ్నలు అడగడంతో మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించి, ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
