TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!

revanth Reddy

మన పత్రిక, వెబ్​డెస్క్: వరంగల్, హనుమకొండ నగరాల్లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. అత్యవసర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైదరాబాద్ (హైడ్రా) సిబ్బందిని, వారి వద్దనున్న వరద సహాయక సామగ్రిని … Read more

Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!

Collector Nizamabad

మన పత్రిక, వెబ్​డెస్క్: Collector Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల (Purchasing Center) నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నవీపేట, రెంజల్ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట కేంద్రంలో ధాన్యాన్ని నిర్దేశిత మిల్లుకు కాకుండా వేరే మిల్లుకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలలో జాప్యం జరగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. … Read more

Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.

Prakasam Barrage

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ వర్షాలు, ఎగువ ప్రాంత వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. గురువారం బ్యారేజీలోకి 4.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4.90 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, కీసర, వైరా వంటి ఉపనదుల నుంచి మరో 2 … Read more

ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!

ACb arrest yadagirigutta

ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి ఇంజనీర్.. రూ.1.90 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానం (yadagirigutta temple) సీనియర్ ఇంజనీర్ (S.E) ఉడేపు రామారావు లంచం కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా, హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ దుకాణంలో ఆయన్ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం రామారావును ఏసీబీ అధికారులు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఆయనకు చెందిన పలు ఆస్తులు, … Read more

New Aadhaar Rules: కొత్త రూల్స్.. ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్!

New Aadhaar Rules november 1

మన పత్రిక, వెబ్​డెస్క్: ఇప్పటివరకు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, లేదా మొబైల్ నెంబర్ లాంటి వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి, టోకెన్ తీసుకుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కోసారి రద్దీ కారణంగా రెండు, మూడు రోజులు తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ, నవంబర్ 1 నుంచి ఈ మార్పులన్నీ ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించనుంది. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, … Read more

Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!

nalgonda gurrampode bike accident anusha

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో దారుణ ప్రమాదం జరిగింది. శేషిలేడివాగు బ్రిడ్జిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25), అతని భార్య అనుష (21) తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వేగానికి అనుష బ్రిడ్జి పైనుంచి ఎగిరి ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. స్థానికులు 15 నిమిషాల తర్వాత ఆమెను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను, తీవ్ర గాయాలపాలైన భర్త నవీన్‌ను … Read more

TG Inter: ఇంటర్ ఫలితాలు నేడే

Open 10th and Intermediate public exams result today

మన పత్రిక, వెబ్​డెస్క్: (open 10th result 2025) తెలంగాణ రాష్ట్ర ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 30) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఓపెన్ స్కూల్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఈ పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా పొందవచ్చని … Read more

Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు

Telangana school news today rain

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు (అక్టోబర్ 30, 2025) సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలన్నిటికీ ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, కరీంనగర్ … Read more

Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!

devarakonda mandal

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ (cyclone montha) కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య 108 సిబ్బంది సాహసం చేశారు. దేవరకొండ మండలం (Devarakonda mandal) మడమడక గ్రామానికి చెందిన జట్టి దేవి అనే నిండు గర్భిణీకి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు 108కి కాల్ చేయగా, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోని మైనంపల్లి వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో … Read more

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!

yellampalli project water level today

మన పత్రిక, వెబ్​డెస్క్: భారీ ఇన్‌ఫ్లో కారణంగా అధికారులు ప్రాజెక్టుకు చెందిన మొత్తం 62 గేట్లలో 13 గేట్లను ఎత్తి, 1,05,157 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 147 మీటర్లు (పూర్తి స్థాయి మట్టం 148 మీటర్లు)గా ఉంది. ఈ ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ (ఎస్సారెస్పీ) నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం … Read more