యుద్ధం.. ఆకాశానంటుతున్న గ్యాస్, నూనె ధరలు

మన పత్రిక, TG: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందా.. మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, వంటగది ఖర్చులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర రూ.965 … Read more

పగలు ఎండ.. సాయంత్రం ఉరుములు, మెరుపులు

మన పత్రిక, వాతావరణం: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. India Meteorological Department (ఐఎమ్‌డీ) హెచ్చరికల ప్రకారం నేడు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశమూ ఉంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నాయి. Hyderabadలో పాక్షిక మేఘావరణం ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి మోస్తరు … Read more

IPL.. నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్

మన పత్రిక, స్పోర్ట్స్: పీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఘోర ఓటమి పాలైన చెన్నై, ఈసారి గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. సారథి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఆశలు ప్రధానంగా స్టార్ ఆటగాళ్లపై నిలిచాయి. భారీ ధరకు జట్టులోకి వచ్చిన … Read more

Ramcharan : “పెద్ది” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అయినా కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..

Ram charan give clarity on Peddi Release date

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై ఇప్పటికి క్లారిటీ లేక ఫ్యాన్స్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ గా మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్… ఆ తర్వాత డేట్ మార్చి ఏప్రిల్ 30ను విడుదలవుతుందని ఫైనల్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆ డేట్ నుండి కూడా తప్పుకుని, పెద్ది జూన్ లో రిలీజ్ … Read more

Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్

Ramayana Teaser Talk 2026

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “రామాయణ” (Ramayana) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.2000 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన లభించగా, హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక రామాయణ టీజర్‌ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్ మరియు నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. … Read more

విజయవాడ: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా

మన పత్రిక: తెలుగు బిగ్‌బాస్‌ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే వివాహం జరిగినప్పటికీ, తొలి వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సొంతూరికి వెళ్లి భర్తతో కలిసి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయవాడకు చెందిన తమన్నాతెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. … Read more

మీసేవ వినియోగ ఛార్జీలు పెంపు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలపై వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులతో పాటు సేవలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో మొత్తం భారం 77–78 శాతం వరకు పెరిగింది. కేటగిరీ-ఏ … Read more

HNK: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి!

మన పత్రిక, క్రైం: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఐనవోలు మండలం ఫున్నేలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ అజహరుద్దీన్ తన భార్య ఫర్హత్‌(26), కూతుళ్లు ఉమేరా(8), ఆయేషా(7)తో కలిసి బుధవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. కొంతసేపు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీటిలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. పిల్లలకు ఈత రాక మునిగిపోతుండగా వారిని రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు … Read more

మహబూబ్‌నగర్: జబర్దస్త్‌ కొమురక్కపై దాడి

మన పత్రిక: జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై అభిమానులమని నమ్మించి ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బూర్గుల పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్‌ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉడిత్యాలలోని కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగింది. ఈ విషయంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నానని అంగీకరించి తిరిగి ఇస్తానని … Read more

‘రణబలి’ సినిమా షూటింగ్ వీడియో లీక్

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, T-సీరిస్ సమర్పిస్తోంది. ఇటీవలే విజయ్, రష్మిక పెళ్లి వార్తలతో ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమాలో వీరు పోషిస్తున్న రణబలి, జయమ్మ పాత్రలపై ఆసక్తి మరింత పెరిగింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా … Read more