హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఛాంబర్ లో ఆయనతో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 21 ఐఐఎంలు ఉన్నాయని, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటివరకు ఐఐఎం మంజూరు కాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టెక్నాలజీ, లైఫ్ … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 17 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు మనోబలమే శ్రీరామరక్ష. మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. తోటివారు ఇచ్చే సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే, వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వృషభ రాశి వారు తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలోని గొప్పవారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి, ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒక సంఘటన మిమ్మల్ని బాధకు గురిచేసే ఆస్కారం ఉంది కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమం. వృషభ రాశి వారు ఈరోజు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇంటా బయటా జరిగే శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా … Read more

ఉచిత గ్యాస్ కనెక్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం.

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు వంట గ్యాస్ భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) ద్వారా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు, కేవలం రూ. 550కే సిలిండర్ (ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ) అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు. అర్హతలు: ఈ పథకానికి భారతీయ పౌరసత్వం ఉన్న 18 ఏళ్లు … Read more

ఢిల్లీ వెళ్లాల్సిన లోకేశ్ విమానం జైపూర్‌కు మళ్లింపు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తర భారతదేశంలో కమ్మేసిన దట్టమైన పొగమంచు (Fog) విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరగా, అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్‌కు (Jaipur) మళ్లించారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇప్పటివరకు దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. … Read more

అది సినిమా కాదు.. బీజేపీ పొలిటికల్ ఎజెండా

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) ‘రజాకార్’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి తీసింది కాదని, అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ (BJP) రాజకీయ ఎజెండాలో భాగమని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. చరిత్రను మానవీయ కోణంలో చెప్పాలి కానీ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ నెగటివ్‌గా చూపించడం సరికాదన్నారు. రజాకార్లలో కేవలం ముస్లింలే కాకుండా ఇతరులు కూడా ఉన్నారని, సాయుధ పోరాటం … Read more

మసక మసక పాటతో మళ్లీ రచ్చ.. వరల్డ్ టూర్ ప్లాన్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు పాప్ ఐకాన్ స్మిత (Smita) సుదీర్ఘ విరామం తర్వాత మ్యూజిక్ ప్రపంచంలోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాల క్రితం కుర్రకారును ఉర్రూతలూగించిన ‘మసక మసక చీకటిలో’ పాటను ఇప్పుడు ‘ఓజీ’ (OG) పేరుతో కొత్త హంగులతో రీమిక్స్ చేసి వదిలారు. వెస్ట్రన్, జాజ్ మ్యూజిక్ కలయికతో రూపొందించిన ఈ పాటను బిగ్‌బాస్ వేదికపై నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. కీలక విషయాలు: 45 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్‌నెస్‌తో స్మిత … Read more

2026 సిలబస్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే! | JEE ADVANCED SYLLABUS 2026

మన పత్రిక, వెబ్​డెస్క్: ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 (JEE Advanced 2026) సిలబస్‌ను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) అధికారులు అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వచ్చే ఏడాది మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 5న అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, తాజాగా సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పొందుపరిచారు. విద్యార్థులు కింద … Read more

నువ్వు నాకు నచ్చావ్ 4K రీ-రిలీజ్.. వెంకీ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.

Nuvvu Naaku Nachav

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు సినీ ప్రేమికులకు నూతన సంవత్సర కానుకగా విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) మళ్లీ థియేటర్లలోకి రానుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి 4K సాంకేతిక హంగులతో 2026 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటల మ్యాజిక్, విజయ భాస్కర్ దర్శకత్వం, వెంకటేష్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన … Read more

Bapu | తెలుగుదనానికి నిలువెత్తు సంతకం బాపు జీవిత విశేషాలు

తెలుగు సంస్కృతికి, అందానికి, హావభావాలకు నిలువెత్తు సంతకం బాపు. నేడు (డిసెంబర్ 15) ఆ ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడి జయంతి. ఈ సందర్భంగా బాపు-రమణల స్నేహం, వారు సృష్టించిన దృశ్య కావ్యాల గురించి మనపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం. మన పత్రిక, వెబ్​డెస్క్: ముగ్ధ మనోహరమైన రూపాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే అద్భుతమైన కుంచె బాపు సొంతం. ఆయన గీసే బొమ్మలు కేవలం కాగితంపై గీతలు కాదు; అవి మాట్లాడతాయి, సిగ్గుపడతాయి, నవ్విస్తాయి, ఒక్కోసారి వెక్కిరిస్తాయి కూడా. … Read more