మన పత్రిక, వెబ్‌డెస్క్: ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 (JEE Advanced 2026) సిలబస్‌ను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) అధికారులు అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వచ్చే ఏడాది మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ఇప్పటికే డిసెంబర్ 5న అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, తాజాగా సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పొందుపరిచారు. విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా సిలబస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
