కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన “అన్నగారు వస్తారు” (Annagaru Vostaru) సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ అప్పటికే ఉన్న పోటీ వల్ల, తెలుగు డబ్బింగ్ పూర్తి కాకపోవడం వల్ల థియేటర్లలో తెలుగులో విడుదల కాలేదు. ఇక తెలుగులో క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. అందుకే లేట్ అయినా తెలుగులో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఫైనల్ గా డైరెక్ట్ గా ఓటిటి లోనే తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు మేకర్స్.
వివరాల్లోకి వెళితే కార్తీ నటించిన “అన్నగారు వస్తారు” సినిమాలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటించగా, నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించాడు. . అయితే ఒరిజినల్ గా ఈ సినిమా ‘వా వాథియర్’ (Va Vathiyaar) అంటూ తమిళ్ లో పొంగల్ సమయంలో అక్కడ రిలీజ్ అయింది. కానీ అక్కడ ఆశించిన మేర సక్సెస్ కాలేదు. ఇక ఫైనల్ గా తెలుగులో ఓటిటిలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక అన్నగారు వస్తారు సినిమాని అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో సంస్థ సొంతం చేసుకోగా నేటి నుంచి తమిళ, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
అయితే నిజానికి నాలుగు వారాల తర్వాత రిలీజ్ కావాల్సింది, కానీ విడుదలైన ఫలితం ప్రభావమో లేక ఏమో తెలీదు గాని, కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా వచ్చేయడం గమనార్హం. అందువల్ల థియేటర్లో అన్నగారిని మిస్ అయిన వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) సంగీతం అందించగా స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహించారు. అయితే ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం తొందరగానే ఓటిటి లో విడుదలైంది కాబట్టి ఇక్కడ మంచి రెస్పాన్స్ అందుకుని ట్రెండ్ అవుతుందని భావిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
