టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా (Sankranthi race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో సంబంధం లేకుండా, మరీ చిన్న సినిమాలు కాకుండా, స్టార్ హీరో నుండి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కలిపి ఏకంగా 5 పండక్కి ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదనే చెప్పాలి. ఇక ఈ పొంగల్ రేస్ లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (Rajasaab) గా వచ్చి సందడి చేస్తున్నాడు. కాగా నిన్న చిరంజీవి (Chiranjeevi) “మన శంకర వర ప్రసాద్” (MSVPG) గా వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు. అలాగే లేటెస్ట్ గా రవితేజ (Raviteja) ” భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha mahashayulaku vignapti) అంటూ విచ్చేశాడు. కాగా ఈ సినిమాల్లో దేనికవే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా మెప్పించడానికి ట్రై చేస్తున్నాయి.
ఇక ఈ సంక్రాంతికి మరో రెండు సినిమాలు మిగిలి ఉండగా, చిన్న సినిమాలుగా రేపే (జనవరి 14)న రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో ఒకటి నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన “అనగనగ ఒకరాజు” (Anaganaga okaraju) కాగా, మరొకటి శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన “నారి నారి నడుమ మురారి” (Nari nari naduma murari). రెండూ కూడా ఫ్యామిలీస్ ని ఎంటర్టైన్ చేసే మంచి కాన్సెప్ట్ తోనే రిలీజ్ కి రెడీ అవుతుండగా, రెండింట్లో ప్రధానంగా నవీన్ పోలిశెట్టి నటించిన “అనగనగా ఒకరాజు” పై అంచనాలు బాగా ఉన్నాయని తెలుస్తుంది. పైగా మేకర్స్ ముందు నుండి అద్భుతంగా ప్రమోషన్లు చేయగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సూపర్ గా ఉన్నయని చెప్పొచ్చు.
ఇక శర్వానంద్ నారి నారి నడుమ మురారి కూడా కాన్సెప్ట్ బాగుంటే పండక్కి ఫ్యామిలి ఆడియన్స్ ని మెప్పించే అవకాశం లేకపోలేదు. మరి ఆల్రెడీ గట్టి పోటీ ఇస్తున్న పెద్ద సినిమాల నడుమ, ఈ మిడ్ రేంజ్ సినిమాలు సంక్రాంతి రేస్ లో ఎంత పోటీ ఇస్తాయో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
