Advertisement

ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్: 30GB డేటా మరియు 18కిపైగా ఓటీటీ ప్రయోజనాలు

మన పత్రిక, హైదరాబాద్: టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారుల కోసం కొత్తగా రూ.200 డేటా వోచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో 30GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అయితే ఇది బేస్ రీఛార్జ్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G సేవలతో పాటు వినోదం కోసం 18కిపైగా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ద్వారా ఈ ప్రయోజనాలను యూజర్లు పొందవచ్చు. 30GB డేటా పరిమితి ముగిసిన తర్వాత ప్రతి MBకి 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది. 5G సేవలను వినియోగించుకోవడానికి యూజర్ల వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Advertisement