మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, యుగంధర్‌గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించబడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. కంటైనర్ డ్రైవర్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై జరిగిన ఘటన కారణంగా కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారు IPL మ్యాచ్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
