మన పత్రిక, ఆంధ్రప్రదేశ్ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తనకు రూ.5 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మనస్తాపంతో రాగశ్రీ ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాగశ్రీ మరణించింది. కూతురి ఆత్మహత్యపై తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో తనకూతురిని లీలా కుమార్ ఇబ్బంది పెట్టాడని, అతన్ని అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. రాగశ్రీ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
