మన పత్రిక: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,51,090కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,510గా ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలిస్తే, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,50,940గా కొనసాగుతోంది. చెన్నైలో రూ.1,51,110, వడోదరలో రూ.1,50,990గా నమోదైంది. ఇక వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.5 లక్షల సమీపంలో కదలాడుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో కేజీ వెండి రూ.2,54,900గా ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో రూ.2,49,900గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మార్పిడి విలువలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ధరల్లో మార్పులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
