మన పత్రిక, తెలంగాణ క్రైం: కరీంనరగ్ జిల్లాలోని గోదావరిఖనిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ లోపలే ఇరుక్కుపోయారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
