Advertisement

AP: మాజీ మంత్రిపై పేర్ని నానిపై కేసు నమోదు

మన పత్రిక, రాజకీయం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు దిగిన ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. చిలకలపుడి చిలకలపూడి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం, మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి అధికారులను బెదిరించడం సరికాదని పేర్కొంది. సంఘం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది.

Advertisement