మన పత్రిక: తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే వివాహం జరిగినప్పటికీ, తొలి వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సొంతూరికి వెళ్లి భర్తతో కలిసి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విజయవాడకు చెందిన తమన్నాతెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. షోలో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ, యాంకర్ శ్రీముఖితో సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో తమన్నా కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన నిజాయితీకి శ్రీముఖి ఆకర్షితురాలైందని, తన జీవితంలో ఆమె లాంటి స్నేహితురాలు లేరని భావోద్వేగంగా తెలిపింది. ఇక తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన తమన్నా అసలు పేరు మస్తాన్ అని వెల్లడించింది. గుంటూరులోని మస్తాన్ బాబా దర్గా వద్ద తన తల్లిదండ్రులు మొక్కుకున్న తర్వాత తాను పుట్టినట్లు చెప్పింది. అనంతరం ముంబై వెళ్లి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని తన పేరును తమన్నాగా మార్చుకున్నట్లు తెలిపింది. హీరోయిన్ Tamannaah Bhatiaకు ముందే తాను ఈ పేరు పెట్టుకున్నానని స్పష్టం చేసింది.
తమన్నాకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. 2019లో నారా లోకేశ్‌పై మంగళగిరిలో, 2024లో పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలో పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం వివాహ జీవితాన్ని గోప్యంగా ఉంచిన తమన్నా భర్త వివరాలు వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి :
- Vijay Devarakonda: రణబాలి షూటింగ్.. విజయ్ దేవరకొండ ఫైట్ సీన్ లీక్
- సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం షాక్: ఐటీ రూల్స్ సవరణ
- ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదలకు కసరత్తు
- Ramcharan : “పెద్ది” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అయినా కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..
- Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్
