మన పత్రిక, క్రైం: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బాణావత్ రాందాస్ అనే వ్యక్తి ప్రతిరోజులాగే సోమవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య కవితతో వాగ్వాదం తలెత్తింది. క్షణికావేశంలో అదుపుతప్పిన రాందాస్ కత్తితో భార్యతో పాటు కుమారుడు హర్ష, కూతురు ప్రణీతపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య కవిత, కుమారుడు హర్ష అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రణీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
