మన పత్రిక, స్పోర్ట్స్: రేపు ప్రారంభమయ్యే Indian Premier Leagueకు ముందే Royal Challengers Bengaluruకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టుకు కీలక బౌలర్‌గా భావించిన నువాన్ తుషారా(Nuwan Thushara) ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఎన్ఓసీ ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. గాయం ఏదీ లేకపోయినా ఫిట్నెస్ సరిగా లేదనే కారణంతో ఐపీఎల్లో పాల్గొనడాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంపై శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్(Chaminda Vaas) స్పందిస్తూ బోర్డు వైఖరిని తప్పుపట్టారు. ఫిట్నెస్ అంశాన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి, ఐపీఎల్ ముందు అకస్మాత్తుగా కఠిన నిబంధనలు అమలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపే అవకాశముందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
