మన పత్రిక: దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, లాక్డౌన్పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఇలాంటి సమయంలో ఐకమత్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, దేశం ఎదుర్కొంటున్న ఇంధన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన చర్యలు ఇప్పటికే తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
