మన పత్రిక, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల పెండింగ్‌పై అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను తమ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టలేదని, అవి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.627 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను బకాయి పెట్టిందని, అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.360 కోట్లు ఉన్నాయని వివరించారు.
రూ.2,400 కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బకాయిల భారాన్ని తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ప్రతి నెలా సగటున రూ.90 కోట్లు వెచ్చిస్తున్నామని, పేదలకు వైద్యం అందడం లేదంటూ ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గత పాలనలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరుగుతోందని, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే బయటపడతారని ఆయన హెచ్చరించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పీఏల వివరాలు కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- HYD: 29, 30వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు
- రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్
- TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
- కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?
- HYDలో సిలిండర్లు లాక్కెళ్తున్న ప్రజలు
