మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) రీసెంట్ గా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, పొంగల్ పోటీ వల్ల ఆశించిన ప్రజాదరణ దక్కించుకోలేదు. కానీ రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించాడు. ఇక అదే ఉత్సాహం తో ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రవితేజ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు “శివ నిర్వాణ” (Siva nirvana) దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మాస్ మహారాజ్ రవితేజ బర్త్ డే (జనవరి 26) సందర్బంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి “ఇరుముడి” (Irumudi) అనే టైటిల్ నిశ్చయించగా, ఈరోజు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రవితేజ అయ్యప్ప మాలలో ఇరుముడి నెత్తిన పెట్టుకుని, చిన్న పాపను ఎత్తుకుని కనిపిస్తున్నాడు. చూడ్డానికి డీసెంట్ గా మంచి డివోషనల్ టచ్ తో మూవీ వస్తున్నట్టు అనిపిస్తుంది. రవితేజ తన మాస్ జోనర్ కి చాలా భిన్నంగా ఉండే మంచి పాత్ర చేస్తున్నారని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. మూవీ టీం ద్వారా “కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి”, అలాంటి ఒక కథే ఈ ఇరుముడి”. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను, కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అంటూ రవితేజ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇరుముడి సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ (Priya bhavani Shankar) నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ (GV prakash kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్ర నటీనటుల గురించి ఇంకా వివరాలు కావాల్సి ఉంది. ఒక్కటి మాత్రం నిజం… పోస్టర్ చూస్తుంటే ఈ సారి రవితేజ సరికొత్తగా వచ్చి ఆడియన్స్ ని అలరించి అదిరిపోయే సక్సెస్ ని సొంతం చేసుకుని కం బ్యాక్ ఇస్తాడనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
