Advertisement

Peddi : పెద్ది నుండి క్రేజీ న్యూస్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “పెద్ది” (Peddi) ఒకటి. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది ఎప్పుడెప్పుడు వస్తుందా అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక పెద్ది నుండి వచ్చిన ఎలాంటి అప్డేట్ అయినా, అంచనాలను మించేలా చేస్తుంది. ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ, రీసెంట్ గా చికిరి సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా పెద్ది గురించి మరో క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.

పెద్ది సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనుందని.. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ (AR Rahman) ఓ రేంజ్ లో మాస్ ట్యూన్స్ సిద్ధం చేసాడని సమాచారం. ఇక ఈ సినిమాలో ఆ ఐటెం సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrinal thakur) నటించనుందని, రామ్ చరణ్ తో అదిరిపోయే స్టెప్పులు ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో కల్ట్ మాస్ బీట్ రానుందని చెప్పాలి. ఇక సీతారామం తో ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తుండగా, పెద్ది లో స్పెషల్ సాంగ్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

ఇక పెద్ది మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిపోగా, మార్చి 27న సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ చేస్తున్నారు. అయితే షూటింగ్ ఇంకా చాలా వరకు మిగిలి ఉన్నందున టైం కి పూర్తవకపోతే ఏప్రిల్ గాని మే కి గాని వాయిదా పడే అవకాశం ఉంది.

Advertisement