గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” (Peddi)పై పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన ఫస్ట్ లుక్ నుండి టీజర్ సహా, చికిరి (Chikiri) సాంగ్ కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసాయి. పెద్ది నుండి ఏ అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. ఇక పెద్ది నుండి రెండో సాంగ్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా పెద్ది వాయిదా పడుతుందని కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. మార్చిలో వస్తున్న సినిమాల పోటీని చూస్తుంటే, అలాగే పెద్ది అప్డేట్స్ లేట్ అవడం చూస్తుంటే ఫ్యాన్స్ మైండ్ లో రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి.
ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మార్చ్ లో భారీ పోటీ నెలకొని ఉంది. మార్చి 19న బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ “ధురంధర్” సీక్వెల్ చిత్రం “ధురంధర్ 2” (Durandhara2) రిలీజ్ కానుంది. అలాగే అదే రోజు రాక్‌స్టార్ యష్ (Yash) నటిస్తున్న “టాక్సిక్” (Toxic) మూవీ కూడా రిలీజ్ కానుంది. వీటిపై ముఖ్యంగా నార్త్ లో భారీ క్రేజ్ ఉంది. వీటి తర్వాత వారం తేడాతో తెలుగులో నాని ప్యారడైస్ (Paradise) కూడా రిలీజ్ కానుంది. దీంతో పెద్దికి భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇదంతా కాకపోయినా, పెద్ది షూటింగ్ ఇప్పటివరకు 70 శాతమే అయిందని మిగతా రెండు నెలల్లో మరో ముప్పై శాతం షూటింగ్ చేయడం కష్టమని అందువల్ల మేకర్స్ వాయిదా వేసే ఛాన్స్ ఉందని, లాంగ్ రన్ కోసం సమ్మర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మేకర్స్ క్లారిటీ ఇచ్చి ఇలాంటి వార్తలకు చెక్ పెడతారా? లేదా లాంగ్ రన్ కోసం పెద్ది ని వాయిదా వేస్తారా అనేది చూడాలి.
