మన పత్రిక వెబ్డెస్క్, సూర్యాపేట: ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సామాన్యులను పీల్చిపిప్పి చేస్తున్న మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పర్మిషన్ మంజూరు చేయడానికి లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసలేం జరిగింది? తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పర్మిషన్ ఇవ్వాలంటే రూ. 6,000 లంచం ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణ డిమాండ్ చేశారు. బాధితుడు డబ్బులు ఇవ్వలేక, విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
రెడ్ హ్యాండెడ్ గా.. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర నేతృత్వంలోని బృందం పక్కా ప్లాన్ వేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సదరు వ్యక్తి నుంచి రూ. 6,000 లంచం తీసుకుంటుండగా సెక్రటరీ కృష్ణను అధికారులు పట్టుకున్నారు. ఆయన చేతికి రసాయన పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు.
అనంతరం కృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు.. కుక్కడం గ్రామంలోని ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పి తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
