మన పత్రిక, వెబ్‌డెస్క్: రోషన్ చూడటానికి అందగాడు, లేడీ ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే పక్కా ‘హీరో మెటీరియల్’. ‘నిర్మల కాన్వెంట్’ నుంచే తనలో ఈజ్ కనిపిస్తోంది. అయితే తాజా సినిమా ‘ఛాంపియన్’ విషయానికి వస్తే, రోషన్ ఎంపిక కాస్త తప్పిందనే అనిపిస్తోంది. నిజాం కాలం నాటి రజాకార్ల అరాచకాలు, భైరాన్‌పల్లి పోరాటం వంటి బరువైన ఇతివృత్తం ఉన్న ఈ కథలో.. ఒక పోరాట యోధుడి పాత్రను పోషించడానికి రోషన్ వయసు, అనుభవం సరిపోలేదేమో అనిపిస్తుంది. కొన్ని సీన్లలో లీడ్ హీరోలా కాకుండా, ఇంకా చిన్న పిల్లాడిలా (లేతగా) కనిపించడం మైనస్.
కథ విషయానికి వస్తే.. మైఖేల్ (రోషన్) అనే కుర్రాడికి లండన్ వెళ్లి ఫుట్‌బాల్ ఆడాలనేది కల. కానీ అక్కడి పరిస్థితులు అతన్ని భైరాన్‌పల్లి పోరాటంలోకి ఎలా లాగాయి? తన వ్యక్తిగత ఆశయం నుంచి ప్రజా పోరాటం వైపు అతను ఎలా మళ్లాడు అనేదే ఈ సినిమా. అయితే ఇంతటి సీరియస్ కథలో రోషన్ డైలాగ్ డిక్షన్, తెలంగాణ యాస పలికించడంలో తడబడ్డాడు. ఇక హీరోయిన్ అనస్వరా రాజన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు, పైగా డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. కేకే మీనన్ వంటి గొప్ప నటుడిని పెట్టుకున్నా, ఆయన స్థాయికి తగ్గ పాత్ర ఇవ్వకుండా వృథా చేశారు.
దర్శకుడు ప్రదీప్ అద్వైతం మంచి పాయింట్ తీసుకున్నా, దాన్ని తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. చారిత్రక సినిమా అంటే ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావాలి, కళ్లు చెమర్చాలి. కానీ ఇందులో ఏ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ లోపంతో ఫస్టాఫ్, సెకండాఫ్ ఫ్లాట్ గా సాగిపోతాయి. ఇంటర్వెల్ లో ఏదో జరుగుతుందని ఆశిస్తే నిరాశే మిగులుతుంది.
సాంకేతికంగా చూస్తే సినిమా చాలా రిచ్ గా ఉంది. స్వప్న సినిమా నిర్మాణ విలువలు, మధీ విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా “గిర గిర గింగిరాగిరే” పాట ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. కానీ కేవలం ఒక పాట కోసం సినిమా మొత్తాన్ని భరించలేం కదా. రోషన్ కష్టపడినా, తన వయసుకు మించిన పాత్ర ఎంచుకోవడం దెబ్బకొట్టింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
