మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఇయర్ మన శంకర వర ప్రసాద్ తో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నారు. తదుపరి సినిమాల విషయంలో కూడా ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. అయితే ‘విశ్వంభర’ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ చిరంజీవి నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
విశ్వంభర కాకుండా చిరంజీవి ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఇక బాబీ – చిరు కాంబోలో ఇంతకు ముందు వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవనుంది. అయితే తాజాగా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ పై లుక్ టెస్ట్ జరుగుతున్నట్టుగా డైరెక్టర్ బాబి ఓ పిక్ ని షేర్ చేస్తూ, ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం జరుపుకోనున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు.
ఇక మూవీకి కేవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా మిగతా డీటెయిల్స్ అతి త్వరలోనే ముందుకు రానున్నాయి. బహుశా మే లో ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకోవచ్చు. అయితే దీనికన్నా ముందు విశ్వంభర షూటింగ్ ని ఎంతసమయంలో పూర్తి చేసి రిలీజ్ చేస్తారో తెలియాలి.
ఇవి కూడా చదవండి :
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
- Tech Mahindra : హైదరాబాద్ టెక్ మహీంద్రా లో భారీ వాక్ ఇన్ డ్రైవ్
- Darling ReRelease : కొత్త సినిమాలు కాదు.. చివరికి రీ రిలీజ్ సినిమా దిక్కయింది..
- Ustaad Bhagat Singh : రిసల్ట్ ఎలా ఉన్నా గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో!
