మన పత్రిక, వెబ్డెస్క్: TGPSC GROUP 2 2015 FINAL LIST – తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. TGPSC గ్రూప్-2 (2015) ఫైనల్ ఎంపిక జాబితాను పూర్తిగా రద్దు చేస్తూ న్యాయమూర్తి నాగేశ్ భీమపాక మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు, టెక్నికల్ కమిటీ నివేదికకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని కోర్టు తేల్చి చెప్పింది.
OMR షీట్ల పార్ట్-బి (జవాబుల భాగం)లో వైట్నర్ వాడకం, టాంపరింగ్ ఉంటే వాటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ TGPSC వాటిని పక్కనపెట్టి, ఆటోమేటెడ్ స్కానర్ల ద్వారా రీ-ఎవాల్యుయేషన్ చేసిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిక్ రిక్రూట్మెంట్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని, అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యం కోసం న్యాయాన్ని బలి చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
