ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ ఉద్యోగాలు — రూ.15 వేల వేతనంతో టీచర్ నియామకాలు త్వరలో
తెలంగాణలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న ప్రభుత్వ పాఠశాలలు 2,837గా గుర్తించబడ్డాయి. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ప్రభుత్వం టీచర్ల నియామకానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా నియమించబడే కంప్యూటర్ టీచర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వేతనం సంవత్సరం లో 10 నెలలపాటు సమగ్ర శిక్ష నిధుల ద్వారా అందించబడుతుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4,200 కంప్యూటర్లు సమకూర్చినా, ఆ ప్రాజెక్ట్ కాలపరిమితి పూర్తయ్యాక ల్యాబ్‌లు నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ తాజాగా చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కొత్త నియామకాలను చేపట్టనుంది.
బెంగళూరుకు చెందిన “ఏక్ స్టెప్ ఫౌండేషన్” సహకారంతో 1,354 పాఠశాలల్లో అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇప్పటికే అమలులో ఉంది. అదేవిధంగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఖాన్ అకాడమీ ద్వారా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు గణితం, సైన్స్ పాఠాలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న బోధకులు అవసరమని విద్యాశాఖ పేర్కొంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
