Balakrishna : టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా ఏపీలోని తన సొంత నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కిరికెర పంచాయతీ, బసవనపల్లి గ్రామంలో ఉన్న జెడ్‌పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
Advertisement
ఈసందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన బాలకృష్ణ తాను నటించిన అన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేవే అని, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విద్యార్థులకు మంచి మెసేజ్ ఇస్తాయని అన్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

