Today Horoscope : 11 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : కొత్త పనులను ప్రారంభించకండి. ప్రయాణాలు చేసే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.
వృషభం : ధన లాభం పొందుతారు. శుభవార్త వినే చాన్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. స్త్రీ వల్ల మీకు లాభం వస్తుంది. అత్యంత దగ్గరి వ్యక్తులను కలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మిథునం : శుభకార్యం కోసం ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆత్మీయుల సహాయం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం : కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కానీ, ధన నష్టం ఏర్పడుతుంది. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు ఓపికతో ఉండాలి.
సింహం : కొత్త వ్యక్తులను ఎవ్వరినీ నమ్మకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి.
కన్య : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కుంగిపోతారు. దాని వల్ల ప్రతి విషయానికి భయపడిపోతారు. కొత్త పనులను ప్రారంభించడంలో చాలా సమస్యలు వస్తాయి.
తుల : వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అప్పు కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సాయం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం : ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు అభివృద్ధి చెందుతారు.
ధనుస్సు : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది.
మకరం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కుంభం : బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు. ధన నష్టం ఏర్పడుతుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
