UIDAI News: మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా – వేళ్లముద్ర, కంటి గుడ్డు (ఐరిస్), ముఖ స్కాన్ లను ఎవరైనా అనుమతి లేకుండా ఉపయోగించలేరు. ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సేవల్లో జరిగే మోసాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యూఐడీఏఐ సోషల్ మీడియా ద్వారా ఈ ఫీచర్ గురించి ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. బయోమెట్రిక్ లాక్ చేయడం చాలా సులభం.
- ముందుగా myAadhaar పోర్టల్ (https://myaadhaar.uidai.gov.in ) కు లాగిన్ అవ్వండి.
- మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ మరియు OTP నమోదు చేయాలి.
- తర్వాత పేజీలో “Lock/Unlock Biometrics” ఆప్షన్ ఎంచుకోండి.
- బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా చదవండి.
- “Consent” బాక్స్ ని టిక్ చేసి, “Next” క్లిక్ చేయండి.
- చివరగా మీకు “Your biometrics have been successfully locked” అనే సందేశం వస్తుంది.
లాక్ చేసిన తర్వాత, ఎవరైనా మీ బయోమెట్రిక్ డేటా ఉపయోగించాలంటే మీరు మళ్లీ అన్‌లాక్ చేయాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
