Advertisement

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వేడుకలు

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ గ్రీస్‌లో ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాహ వేడుకలు 2026 నవంబర్ 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నటుడు రజినీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య చెన్నై నుంచి గ్రీస్ బయలుదేరినట్లు సమాచారం.

చెన్నైలో రిసెప్షన్

గ్రీస్‌లో పెళ్లి పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులు నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రంజిని అయ్యంగార్ డిజైన్ చేయగా, అది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ వేడుకల కోసం ఆహ్వానాలు అందాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement