Advertisement

బిగ్ బాస్ 10: కెప్టెన్ వంశీ మినహా ఇల్లు మొత్తం నామినేట్

బిగ్ బాస్ తెలుగు 10 ఇంట్లో నామినేషన్ ప్రక్రియ రసాభాసగా సాగింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ పాత విషయాలను ప్రస్తావించడంతో తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ప్రతి సభ్యుడు మరొకరిని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను వివరించాలని బిగ్ బాస్ ఆదేశించారు.

నామినేషన్ల ప్రక్రియ వివరాలు

ఈ టాస్క్‌లో అమన్ శివను, ముకేష్ సుధీర్‌ను నామినేట్ చేశారు. శ్వేత, నరేష్, దేవజాని, కెప్టెన్ వంశీలు నీతును నామినేట్ చేయగా, నీతు-త్రిగుణ్ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. శివ ముకేష్‌ను, రామకృష్ణ సుధీర్‌ను, సుధీర్ ముకేష్‌ను, రామ్ ప్రసాద్ వర్షిణిని, వర్షిణి సుధీర్‌ను నామినేట్ చేశారు.

Advertisement

బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్

సభ్యుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఒక ప్రధాన ట్విస్ట్ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత నామినేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, కెప్టెన్ వంశీ మినహా మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు ప్రకటించారు. బిగ్ బాస్ నిర్ణయం ఇంట్లోని సభ్యులందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement