Advertisement

రాజకీయాల్లోకి రావడం లేదు: స్పష్టం చేసిన నటుడు సూర్య

ప్రముఖ తమిళ నటుడు సూర్య తన రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారానికి స్వస్తి చెప్పారు. ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే రాజకీయం అంటే తనకు ద్వేషం లేదని, జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు.

రాజకీయాలపై సూర్య అభిప్రాయం

రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు యువతకు దానిపై పూర్తి అవగాహన ఉండాలని సూర్య పేర్కొన్నారు. రాజకీయ నాయకులు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్ లోకి వచ్చే ఎవరైనా సరే పూర్తి అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల చదువుకు మద్దతుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో సూర్య రాజకీయ ప్రవేశంపై కూడా ఊహాగానాలు పెరిగాయి. మరోవైపు, జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం సీన్ థియేటర్లలో విడుదలకి వచ్చి మంచి స్పందన సాధించింది.

Advertisement