Advertisement

పెద్దపల్లి: గంటల వ్యవధిలో దంపతుల మృతి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు అజయ్‌ (28), ఆయన భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చి వకీల్‌పల్లిలో కూలీ పనులు చేసుకుంటూ ఈ దంపతులు జీవిస్తున్నారు. సోమవారం వారికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తోటి కూలీలకు తెలిపారు. వెంటనే వారిని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అజయ్‌ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే దినేశ్వరి కూడా కన్నుమూసింది.

Advertisement

ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలిద్దరూ కొద్దిసేపటి వ్యవధిలోనే ఇలా మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. దంపతుల అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement