Advertisement

నేడు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న పలుచోట్ల కుండపోత వర్షాలు కురవగా.. నేడూ వానలు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో పగటిపూట ఉక్కపోత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారుతుంది.

నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో చెదురుమదురు తుఫాను ముప్పు పొంచి ఉంది. రాజధాని హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది.

Advertisement

మరోవైపు ఏపీలోని కోస్తా జిల్లాలు, రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement