Advertisement

TRSలో జోరు.. మరో 18 స్థానాలకు ఇన్‌ఛార్జుల ప్రకటన

తెలంగాణ రక్షణ సేనలో నియామకాల పర్వం జోరుగా సాగుతోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జులను అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. దీంతో పాటు మెదక్ లోక్‌సభతో పాటు వివిధ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను నియమించారు. ఇప్పటికే 42 స్థానాలకు బాధ్యులను ప్రకటించిన కవిత, తాజా జాబితాతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల నియామకాలను పూర్తి చేశారు. అలాగే 9 జిల్లాలకు అధ్యక్షులు, 3 జిల్లాలకు ప్రధాన కార్యదర్శులను ఖరారు చేశారు. ఎంబీసీ, న్యాయ, ఎన్ఆర్ఐ, విద్యార్థి, సోషల్ మీడియా, మైనార్టీ, రైతు, జర్నలిస్ట్ తదితర అనుబంధ విభాగాలకూ అధ్యక్షులను ప్రకటించారు. ఈ నియామకాల్లో గతంలో మాదిరిగానే బీసీ వర్గాలకు పెద్దపీట వేసినట్లు పార్టీ స్పష్టం చేసింది.

Advertisement