Advertisement

బిగ్‌బాస్ హౌస్‌లో హీటెక్కిన నామినేషన్లు

బిగ్‌బాస్ హౌస్‌లో అసలు సిసలైన ఆట మొదలైంది. తొలి వారం ఎలిమినేషన్ల షాక్ నుంచి తేరుకోకముందే, రెండో వారంలో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అంటూ బిగ్‌బాస్ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌తో తొలి దశ ముగియగా, సోమవారం నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగింది.

ఈసారి నామినేషన్ల కోసం బిగ్‌బాస్ వినూత్నంగా భారీ దిమ్మకు చుట్టిన తాడును విప్పే టాస్క్ పెట్టారు. ఇందులో విజయం సాధించిన కంటెస్టెంట్లు ఇతరులను నామినేట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో సుధీర్ రంగంలోకి దిగి ఏకంగా త్రిగుణ్‌ను టార్గెట్ చేయడం విశేషం. చైత్ర విషయంలో త్రిగుణ్ వ్యవహారశైలి నచ్చలేదని సుధీర్ కారణం తెలిపారు. అంతేకాకుండా, వాష్‌రూమ్ క్లీనింగ్ బాధ్యతలపై షాలినిని కూడా నామినేట్ చేశారు.

Advertisement

మరోవైపు దేబ్జానీ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేయడం ఇంట్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ సైతం త్రిగుణ్‌తో పాటు, సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ఝాన్సీని నామినేట్ చేయడంతో వీరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా, ఏకంగా 10 మంది ఈ వారం ఎలిమినేషన్ రేసులో నిలిచారు. సృష్టి, వంశీ, నరేశ్, అమన్ మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నారు. పది మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఈ వారం ఆట మరింత ఆసక్తికరంగా మారనుంది.

Advertisement