Advertisement

రాష్ట్ర ప్రజలకు సీఎం, కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్‌ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అలాగే, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం మళ్లీ గాడినపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని ఏకదంతుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రజలంతా ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు.

Advertisement