Advertisement

గాజువాకలో కోటి మట్టి గాజులతో గణపతి

విశాఖపట్నం నగరంలోని గాజువాకలో పర్యావరణహితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతి’ ముఖ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పూర్తిగా పర్యావరణానికి మేలు చేసే విధంగా కోటి మట్టి గాజులు, స్వచ్ఛమైన చెరువు మట్టి, కొబ్బరి పీచును ఉపయోగించి శిల్పులు స్వామివారి అద్భుత రూపాన్ని తీర్చిదిద్దారు. ఆదివారం జరిగిన ఈ ముఖ ఆవిష్కరణ వేడుకలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తొలుత స్వామివారిని దర్శించుకుని తరించారు. వైవిధ్యభరితంగా మట్టి గాజులతో తలపెట్టిన ఈ ప్రత్యేక గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Advertisement